ఆ పార్టీలను సమాధి చేస్తాం: గంగారాం
రామాయంపేట(మెదక్): బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న పార్టీలను రాజకీయంగా సమాధి చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారాం, జిల్లా కోశాధికారి దామోదర్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు పోచమ్మల గణేశ్ హెచ్చరించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై బీసీలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు. 46 జీవోను విడుదల చేసిన ప్రభుత్వం తమకు తీరని అన్యాయం తలపెట్టిందని మండిపడ్డారు. జనాభాలో 65% ఉన్న తమకు 42% రిజర్వేషన్లు ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఇకనైనా బీసీ సోదరులంతా కళ్లు తెరువాలని, తమకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సంఘం పట్టణాధ్యక్షుడు పచ్చంటి రాము పాల్గొన్నారు.


