యాగమండపం ప్రారంభోత్సవం
పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేసునీతారెడ్డి
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో కొలువైన బగలాముఖీ శక్తిపీఠం ఆవరణలో నూతనంగా నిర్మించిన యాగమండపాన్ని మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. వేద పండితుడు, బగలాముఖీ ఉపాసకులు శాస్త్రుల లక్ష్మీ వెంకటేశ్వర శర్మ దంపతులు వారి సొంత నిధులతో నిర్మించిన యాగమండపాన్ని వేద పండితుడు గంగవరం నారాయణశర్మ ఆధ్వర్యంలో పూజా మహోత్సవా లు నిర్వహించి ప్రారంభోత్సవం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బగలాముఖీని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ భూదాత స్వరూప రమేశ్‌గుప్తా, స్వాతి మహేష్‌గుప్తా, రమాదేవి తిరుపతిరెడ్డి దంపతులు భక్తులకు ఎలాంటి ఇబ్బదులు రాకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు.
పాల్గొన్న ప్రముఖులు..
యాగమండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంత్‌రావు, మాజీ ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్, సంగీత గాయకుడు రామాచారి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


