
అభివృద్ధిలో పరుగులు
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● మెదక్ జిల్లాలో వేలాది కోట్లతో అభివృద్ధి పనులు ● స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
మెదక్‌జోన్: అభివృద్ధిలో జిల్లా పరుగులు పెడుతోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాను రూ.వేలాది కోట్లకు పైగా ఖర్చుచేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన పోలీస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. జిల్లా లో ఇప్పటివరకు 87,491 మంది రైతులకు గానూ రూ.645.41 కోట్లను రుణమాఫీ చేసిందన్నారు. 2024–2025 సీజన్‌కు సంబంధించి 3,19,144 మె ట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 80,873 మంది రైతుల నుంచి సేకరించి వారికి రూ.740.42 కోట్లను చెల్లించామని వివరించారు. అలాగే 15 వేల మంది రైతుల నుంచి 62,747 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించామని, వీరికి బోనస్ కింద క్వింటాల్‌కు రూ.500 చొప్పున రూ.31.37కోట్లను త్వరలోనే రైతుల ఖాతాలో వేస్తామని చెప్పారు. రైతు భరోసా కింద వానాకాలం సీజన్‌లో 2,62,043 మంది రైతుల ఖా తాల్లో రూ.220.84 కోట్లను జమచేసినట్లు తెలిపారు.
మెడికల్ కాలేజీ భవనానికి రూ.180 కోట్లు
జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి భవన నిర్మాణం కోసం రూ.180 కోట్లు, అలాగే నర్సింగ్ కాలేజీ భవనం కోసం మరో రూ.26 కోట్లను మంజూరు అయినట్లు మంత్రి వివేక్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వివరించారు. ఈ పథకం ద్వార జిల్లాలో ఇప్పటివరకు 18,626 మంది రోగులకు శస్త్రచికిత్సలు చేయగా...ఇందుకోసం రూ. 49.71 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాల కాంప్లెక్స్‌ను రామాయంపేటకు మంజూరైందని వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతుల కోసం రూ.3.26 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
3.2కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు
మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 3.2 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయగా అందుకు రూ.83.50 కోట్ల లబ్ధిని మహిళలు పొందారని మంత్రి వివేక్ చెప్పారు. అలాగే గృహజ్యోతి పథకంలో భాగంగా 1,27,393 మంది విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్లలోపు జీరో బిల్లు జారీ కాగా ఇందుకోసం రూ.65.3 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు.
పేదలకు అండగా...
జిల్లాలో 2,16,716 కుటుంబాలకు మూడు నెలలకు సరిపడే రేషన్ 13,923 మెట్రిక్ టన్నుల బియ్యం అందించినట్లు మంత్రి తెలిపారు. అలాగే జిల్లాలో 9,964 కొత్త రేషన్‌కార్డులను ఇచ్చామన్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా జిల్లాకు మొదటి విడతలో 9,125 ఇళ్లు మంజూరు కాగా, అందుకు రూ.456.25 కోట్లు మంజూరయ్యాయని, వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 1,302 మంది లబ్ధిదారులకు రూ.13.42 కోట్లను వారి ఖాతాల్లో జమచేశాం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు, జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో పరుగులు

అభివృద్ధిలో పరుగులు

అభివృద్ధిలో పరుగులు

అభివృద్ధిలో పరుగులు