
తిరంగా.. మురవంగా
మెదక్ కలెక్టరేట్: మెదక్ కలెక్టరేట్‌లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌రాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావులతో కలిసి మహనీయుల చిత్ర పటాలకు నివాళులర్పించారు. అలాగే స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, జానపద, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలపై విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. విద్యార్థులకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావులు అభినందించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్‌ఓ భుజంగరావు, ఏఓ యూనస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు