
అమర జవాన్ స్తూపం ఆవిష్కరణ
జహీరాబాద్ టౌన్: దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవానుల జ్ఞాపకార్థం ధనసిరి గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ స్మారక స్తూపాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మాజీ సైనికులు ప్రారంభించారు. మొగుడంపల్లి మండలం ఽరాష్ట్ర సరిహద్దులో గల ధనసిరి గ్రామంలో దేశ రక్షణ కోసం ఎందరో సైన్యంలో చేరి సేవలందించారు. ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు గ్రామంలో వీర అమర్ జవాన్ జ్యోతి స్మారక స్తూపం నిర్మాణానికి శ్రీకారం చుట్టి గ్రామస్తుల సహకారంతో పూర్తి చేశారు. 15 చదరపు అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు ఎత్తులో గ్రానైట్ రాయితో ఇండియా గేట్ వద్ద మాదిరిగా నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్శంగా మాజీ సైనికులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, మాజీ ఎంపీ.బీబీపాటిల్ హాజరై స్మారక స్తూపానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ధనసిరి గ్రామస్తులు సైన్యంలో చేరి దేశసేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు బీదర్ జిల్లా నుంచి, మాజీ సైనికులు హబ్సి దేవరాజ్, కాశీనాథ్, అశోక్ ,గణపతి, సంజీవ్‌రెడ్డి, విశ్వనాథ్, చంద్రశెట్టి, బస్వరాజ్, మల్లికార్జున్, సురేశ్ యాదవ్, బక్కారెడ్డి, యూనూస్ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎంపీ,
మాజీ సైనికులు