
అవార్డులు మరింత బాధ్యతలు పెంచుతాయి
మెదక్ మున్సిపాలిటీ: అవార్డులు, రివార్డులు మరింత బాధ్యతలను పెంచుతాయని ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. జిల్లాలో ఉత్తమ సేవ ప్రశంసా పత్రాలు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. అనంతరం వారిని అభినందించారు.
మహనీయుల త్యాగాలను మరవొద్దు
మనదేశానికి స్వాతంత్య్రం సాధించిన పెట్టిన మహనీయుల త్యాగాలను మరువొద్దని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే ఈ స్వాతంత్య్రమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు సిబ్బంది దేశానికే గర్వకారణంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు