రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
నర్సాపూర్/శివ్వంపేట/వెల్దుర్తి(తూప్రాన్): రాజ్యాంగ పరిరక్షణ కోసమే దేశవ్యాప్తంగా సంవిధాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ పరిశీలకుడు వరప్రసాద్, మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి మండల కేంద్రం, నర్సాపూర్, శివ్వంపేట మండల పరిధిలోని గోమారంలో సంవిధాన్ బచావో కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ నడుం కట్టిందని తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


