మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
మెదక్ కలెక్టరేట్: మైనార్టీల సంక్షేమం, విద్యా ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ సాహబ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో మైనారిటీల సంక్షేమం, విద్యా ప్రగతి గురించి కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే మైనారిటీ సంక్షేమ శాఖ కళాశాలలు, పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారి పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన వెంట మైనార్టీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్ ఉన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ధాన్యం ఎగుమతిలో లారీల సంఖ్య పెంచి రైతులకు సహకరించాలని లారీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్ రెడ్డి, మేనేజర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు
చిలప్‌చెడ్(నర్సాపూర్): అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు అందుతాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న చిలప్‌చెడ్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఈనెల 17న చిలప్‌చెడ్‌లో ఏర్పాటచేసే రైతు సభకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ రానుండడంతో రైతువేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బేస్‌మెంట్ పూర్తయిన వారికి మొదటి విడత డబ్బులు వస్తాయన్నారు. అదేవిధంగా ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పనులు ప్రారంభించాలని సూచించారు.
రాష్ట్ర కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ


