సాగుకు సింగూరు నీళ్లు రావు..
రైతులు పంటలు సాగు చేయవద్దు
కొల్చారం(నర్సాపూర్): సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా ప్రాజెక్ట్ దిగువన ఉన్న ఘణపురం ఆనకట్టకు ఈ యాసంగి సీజన్ పంటల సాగుకు అవసరమైన నీరు విడుదల కాదని కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి పేర్కొన్నారు. మంగళవారం రంగంపేటలో, పరిసర గ్రామాల రైతులకు యాసంగి పంట సాగుపై అవగాహన కల్పించారు. ఎగువ నుంచి నీరు విడుదల కాకపోవడంతో మండలంలో మంజీరాపై నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలకు నీరు అందే పరిస్థితి లేదన్నారు. ఈ యాసంగి సీజన్‌లో లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజశేఖర్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): నూతన సాంకేతికతకు విద్యార్థులు పదునుపెట్టి వారిలో ఉన్న ఆలోచన శక్తిని బయటకు తీయడం అభినందనీయమని డీఈఓ విజయ అన్నారు. నేషనల్ గ్రీన్ కాంపిటీషన్ ఫర్ ఇకో క్లబ్ స్టూడెంట్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం హవేళిఘణాపూర్ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో నిర్వహించగా ఆమె ప్రాజెక్టు నమూనాలను పరిశీలించారు. వినూత్న ఆలోచనలతో ఉపయోగం లేనటువంటి వస్తువులను ఉపయోగపడేలా చేసిన చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆడెపు కరుణాకర్, మండల విద్యాధికారి మధుమోహన్, జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, రాజశేఖర్, సిద్ధిరాములు, రాజేశం, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి తిమ్మాపూర్ లో బంగారమ్మ జాతర మహోత్సవం కనుల పండువగా ముగిశాయి. ప్రతిఏటా మూడు రోజుల పాటు గ్రామస్తులు జాతర నిర్వహించడం ఆనవాయితీ. చివరి రోజు మంగళవారం తూప్రాన్– నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఎలమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. బోనాలు, ఒడిబియ్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
సాగుకు సింగూరు నీళ్లు రావు..
సాగుకు సింగూరు నీళ్లు రావు..


