దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: అర్హత కలిగిన అభ్యర్థులకు లైసెన్స్ సర్వేయర్ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియెట్ (గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండాలి) కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలన్నారు. అలాగే ఐటీఐలో డ్రాఫ్ట్‌మెన్ సివిల్, డిప్లొమా, సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు. జిల్లాలోని ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తెలంగాణలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో మొత్తం 50 పని దినాల శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ కాలానికి ఓసీ అభ్యర్థులకు రూ. 10 వేలు, బీసీ అభ్యర్థులకు రూ. 5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9704443476, 9398987337 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరిస్తాం
న్యాయసేవాధికార
సంస్థ జిల్లా కార్యదర్శి సుభవల్లీ
మెదక్‌జోన్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు చెక్‌బౌన్స్ కేసులను పరిష్కరిస్తామని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకో వాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుభవల్లీ తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచనల మేరకు ఈనెల 19 వరకు ప్రత్యేకంగా చెక్‌బౌన్స్‌కు సంబంధించిన కేసులను పరిష్కరించనున్నట్లు చెప్పారు. అలాగే జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని రాజీ పడాలని వివరించారు. చిన్నచిన్న గొడవలతో కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగి విలువైన సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు.


