నేడు లాటరీ ద్వారా బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపు
మెదక్ కలెక్టరేట్: పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద గల బార్ అండ్ రెస్టారెంట్ మూడేళ్ల క్రితం మూతపడింది. దీని నిర్వహణ కోసం రీ నోటిఫికేషన్ వేయగా 20 దరఖాస్తు లు వచ్చినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ కలెక్టరేట్‌లో మంగళవారం ఉదయం 11గంటలకు అదనపు కలెక్టర్ నగేశ్ అధ్యక్షతన లాటరీ ద్వారా అర్జీదారులకు కేటాయించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 10:30 గంటల లోపు కలెక్టరేట్‌కు రావాలని సూచించారు.
దొడ్డు ధాన్యానికి
బోనస్ ఇవ్వాలి
శివ్వంపేట(నర్సాపూర్): సన్న వడ్లకు బోనస్ ఇస్తున్న మాదిరిగానే దొడ్డు రకానికి కూడా ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వాలని జిల్లా రైతు రక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు మైసయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కేంద్రాలకు వస్తున్న ధాన్యం ఎప్పటికప్పుడు తూకం వేసి రైస్‌మిల్స్‌కు తరలించాలని, అందుకు అనుగుణంగా హమాలీలను, ట్రాన్స్‌పోర్టును సమకూర్చాలని కోరారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కొనుగోలు కేంద్రాలు
ఏర్పాటు చేయాలి
రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరి
మెదక్ కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా రైతుల అవసరం మేరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 400 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండాలన్నారు. కానీ వరి కోతలు మొదలై నెల రోజులవుతున్నా..ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేయలేదన్నారు. ప్రస్తుతం 107 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారని, ఇంకా 293 ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే 40 కేజీల 60 గ్రాముల ధాన్యం తూకం వేయాల్సి ఉండగా 43 కేజీలు తూకం వేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాలలను
బలోపేతం చేయాలి
తపస్ ఉపాధ్యాయ సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్
చేగుంట(తూప్రాన్): ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని తపస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాతు సురేష్ అన్నారు. సోమవారం చేగుంటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసినప్పుడే ఉన్నత పాఠశాలలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున నియమించాలని, బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పర్చాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లం, లక్ష్మణ్, నాయకులు రాజేశ్వర్, చక్రవర్తి, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు లాటరీ ద్వారా బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపు
నేడు లాటరీ ద్వారా బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపు


