జల సంరక్షణ అందరి బాధ్యత
డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు
టేక్మాల్(మెదక్)/నర్సాపూర్: భూగర్భజలాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఆర్డీఓ పీడీ శ్రీనివా సరావు అన్నారు. గురువారం మండలంలోని కుసంగిలో వాటర్‌షెడ్ యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి సంరక్షణ పెంచడం, పారే నీటిని ఆపడంలో అందరూ ముందుండాలని పిలుపునిచ్చారు. ఇంకుడు గుంత లు, ఊట కుంటలు నిర్మించాలన్నారు. గ్రామాల్లోని రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త ఉదయ్‌కుమార్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సతీష్, ఎంపీడీఓ విఠల్, మాజీ జిల్లా కో– ఆప్షన్ మెంబర్ యూసుఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. అనంతరం నర్సాపూర్ మండల సమాఖ్యలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సెర్ప్ ప్రాజెక్ట్‌లో కొత్తగా చేపట్టిన చిన్న సంఘాలను సైతం ఆడిట్ చేయడం వల్ల సంఘ సభ్యుల ఆర్థిక స్థితి పారదర్శంగా ఉంటుందన్నారు. తద్వారా సంఘాలు బలోపేతం అవడంతో పాటు, ఎక్కువ మొ త్తంలో రుణాలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.


