సన్న బియ్యం నిరుపేదలకు వరం
కలెక్టర్ రాహుల్‌రాజ్
పాపన్నపేట(మెదక్)/చిన్నశంకరంపేట: సన్న బియ్యం నిరుపేదలకు వరమని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండలంలో ఎమ్మె ల్యే రోహిత్‌రావుతో కలిసి లబ్ధిదారులకు సన్నబియ్యం, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 520 రేషన్ షాపులు, 2.13 లక్షల రేషన్‌కార్డులు ఉండగా, 6.96 లక్షల లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. వీరందరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. సన్న వడ్లు పెట్టిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రయోజనకారిగా ఉందన్నారు. రాజీ వ్ యువ వికాసం స్కీంతో నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆ ర్‌ఎస్ హయాంలో ధనికులు సన్న బియ్యం తింటే, నిరుపేదలు మాత్రం దొడ్డు బియ్యం తినాల్సి వచ్చేదన్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేలా సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, ఎమ్మార్వో సతీష్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప నాయకులు పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్లలో వెనకబడిన మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ రాజు, నాయకులు పాల్గ్గొన్నారు.


