కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌జోన్: యాసంగి వరి కోతలు ప్రారంభం కాగానే ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలన్నారు. టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలన్నారు. రైతులు తేమశాతం 17 ఉండేలా చూసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కేంద్రాలకు ధాన్యం తరలించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రకం రూ. 2,320 కాగా సాధారణ రకానికి రూ. 2,300 నిర్ణయించినందని వెల్లడించారు. కాగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, సివిల్ సప్లై డీఎం జగదీష్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సివిల్ రైట్స్‌డే దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెనన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి నమోదైన అట్రాసిటీ కేసులు, పరిష్కరించినవి, బాధితులకు అందిన పరిహారం వివరాలను వెల్లడించారు.


