మల్లన్నా.. పూర్తి కమిటీ ఎప్పుడన్నా? | - | Sakshi
Sakshi News home page

మల్లన్నా.. పూర్తి కమిటీ ఎప్పుడన్నా?

Mar 23 2025 9:16 AM | Updated on Mar 23 2025 9:13 AM

చైర్మన్‌ లేకుండానే కొనసాగుతున్న ఆలయ పాలకవర్గం

సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి యేడాదిన్నరగా పూర్తిస్థాయి పా లకవర్గం లేకుండానే కొనసాగుతోంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం ఒకటి.

చైర్మన్‌ లేకుండానే..

మల్లికార్జున దేవాలయం కమిటీని గతేడాది డిసెంబరు 3న.. ఎనిమిది మంది డైరెక్టర్‌లను, ఒక ఎక్స్‌ ఆఫీషియో సభ్యుడిని నియమించారు. అందులో సీహెచ్‌ కొమురయ్య, మోహన్‌ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్‌, అల్లం శ్రీనివాస్‌, అనిరెడ్డి, మామిడ్ల లక్ష్మి, మహేందర్‌రెడ్డి, జయ ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. ఆలయ కమిటీతో 14 మంది డైరెక్టర్లతో పాటు ఎక్స్‌ ఆఫీషియో సభ్యులను నియమించాలి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిని చైర్మన్‌ చేయాలనుకున్నారు. కానీ ఆ నాయకుడు దరఖాస్తు చేయకపోవడంతో మొదటగా వచ్చిన జాబితాలో డైరెక్టర్‌గా ఎంపిక కాలేదు. దీంతో చైర్మన్‌ను నియమించలేదు. మిగతా డైరెక్టర్ల నియామకం కోసం డిసెంబరు 3 నుంచి 20 రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించారు. ఆరుగురు డైరెక్టర్‌ల కోసం 60 మంది దరఖాస్తు చేశారు. ఆశావహులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయలేదు. చైర్మన్‌ లేకుండానే నేటితో జాతర ముగుస్తోంది.

కమిటీ ఏర్పాటయ్యేనా...

డిసెంబరులో నియమించిన డైరెక్టర్‌ల పదవీకాలం మరో 9 నెలల్లో ముగుస్తుంది. అలాగే జాతర సైతం ముగిసింది. దీంతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారా? మళ్లీ జాతర ప్రారంభ సమయంలోనే నియమిస్తారా? అని జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చసాగుతోంది. దేవాలయానికి పూర్తిస్థాయి కమిటీ లేకపోవడంతో వీవీఐపీ పాస్‌లు ఇష్టారాజ్యంగా అధి కారులు జారీ చేశారని ప్రచారం జరుగు తోంది. ఆ పాస్‌లను ప్రైవేట్‌ వ్యక్తులు బయట విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా దేవాదాయ ఉన్న త అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి వీవీఐపీ పాస్‌లను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.

డిసెంబరు 3న 8మంది

డైరెక్టర్ల నియామకం

అధికారులు ఇష్టారాజ్యంగా

వీవీఐపీ పాసుల జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement