గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
ప్రజలకు ఒరిగిందేమీ లేదు
నర్సాపూర్: రాష్ట్ర బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేదేమి లేదు. ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించలేదు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు తక్కువ నిధులు ఇచ్చారు. మహిళా జ్యోతి పథకానికి నిధులు కేటాయించకుండా మహిళలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారు.
– సునీతారెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్
సముచితంగా ఉంది
రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం అత్యధికంగా నిధులు కేటాయించారు. అలాగే ఆరు గ్యారంటీల అమలు కోసం కేటాయించిన నిధులు అందరిని మెప్పించే విధంగా ఉన్నాయి.
– ఆంజనేయులుగౌడ్, డీసీసీ అధ్యక్షుడు
మోసపూరిత బడ్జెట్
ఇది పూర్తిగా మోసపూరిత బడ్జెట్. వృద్ధులకు పింఛన్ల పెంపు, మహిళలకు రూ. 2,500, పూర్తిస్థాయిలో చేయని రుణమాఫీతో పాటు అనేక హామీలను తుంగలో తొక్కారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏడుపాయల అభివృద్ధికి రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేస్తామని చేయకపోవడం ఈ పాలన తీరుకు అద్దం పడుతుంది.
– మల్లేశంగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
మెదక్‌జోన్: ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగలేదు. దశాబ్దకాలంగా మూతపడిన ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీ ప్రస్తావన ఉంటుందని ఎదురుచూసిన కార్మికులు, రైతులకు నిరాశే మిగిలింది. మెదక్‌కు రింగ్‌రోడ్డు కావాలని చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరుగుతా యని ఆశించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే జిల్లాలో ఏకై క మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు ఘనపూర్ ఆయకట్టు 21 వేల ఎకరాలు ఉంది. ప్రాజెక్టు ఆనకట్ట పెంచితే అదనంగా మరో 10 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఆనకట్ట పెంపునకు సంబంధించి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలు గానే మిగిలాయి. బడ్జెట్‌లో ఘనపూర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యందక్కలేదు. అయితే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మాత్రం ఫలాలు అందనున్నాయి.
పర్యాటకంపై ఆశలు
రాష్ట్ర బడ్జెట్‌లో పర్యాటక రంగానికి రూ. 775 కోట్లు కేటాయించారు. ఇందులో నుంచి జిల్లాకు నిధులు వస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దేవస్థానం, మెదక్ చర్చి, ప్రఖ్యాత ఖిల్లా, నిజాంపాలనలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యంలో గల జింకల ప్రత్యు త్పత్తి కేంద్రం, కొల్చారం మండల కేంద్రంలోని జైన మందిరాలు జిల్లాలో చూడదగిన ప్రదేశాలు. హైదరాబాద్‌కు అతిసమీపంలో జిల్లా ఉండటంతో వీటిని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఈ బడ్జెట్‌లో నుంచి జిల్లాకు నిధులు కేటాయింపులు జరిగితే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది.
ఏడుపాయలకు ఎస్‌డీఎఫ్ నిధులేవి?
గతేడాది డిసెంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఏడుపాయల, మెదక్ చర్చిని సందర్శించారు. ఏడుపాయల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) కింద నాగ్సాన్‌పల్లి నుంచి ఏడుపాయల వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం కోసం రూ. 35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటివరకు నిధులు కేటాయించలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో దేవాదాయ, ధర్మాదాయశాఖకు రూ. 190 కోట్లు కేటాయించారు. వాటిలో జిల్లాకు వాటా ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.
అడవుల అభివృద్ధికి ఊతం!
అడవులు, పర్యావరణం కోసం బడ్జెట్‌లో రూ. 1,023 కోట్లు కేటాయించారు. కాగా జిల్లావ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. కాగా అడవుల సంరక్షణకు అరకొరగానే నిధులు విడుదల అవుతున్నాయి. ఏటా వేసవిలో అడవులు దగ్ధం అవుతూనే ఉన్నాయి. కనీసం ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేసేందుకు సైతం నిధులు లేక సంబంధిత అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులతో జిల్లా అడవుల భద్రతకు నిధులు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు.
సంక్షేమానికి భ రోసా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల అమలు కోసం బడ్జెట్‌లో రూ. 56,084 కోట్లను కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ. 22,500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాగా జిల్లాలో మొదటి విడతగా 1,555 ఇళ్లు మంజూరయ్యాయి. బడ్జెట్ కేటాయింపులతో ఇక ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగనున్నాయి. ఇప్పటికే గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్న ధాన్యానికి బోనస్, రాజీవ్ ఆరోగ్య శ్రీ తదితర పథకాలు కొనసాగుతున్నాయి.
న్యూస్‌రీల్
రాష్ట్ర బడ్జెట్‌లో
జిల్లాకు మొండిచేయి!
ప్రస్తావనకు రాని మెదక్ రింగ్‌రోడ్డు
ఊసేలేని ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీ
ఘనపూర్ ప్రాజెక్టుకు దక్కని ప్రాధాన్యం
విద్యకు అరకొర నిధులు
సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యాభివృద్ధికి బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించారు. కేవలం 7.57 శాతం నిధులు కేటాయించడం సరికాదు. సరైన సౌకర్యాలు లేక ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లుతున్నాయి. విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేయటం సరికాదు.
– యాదగిరి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
గతంలో కంటే తగ్గాయి
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు గతంలో కంటే కేటాయింపులు తగ్గాయి. విద్యాశాఖలో ఉన్న 26,607 పాఠశాలలను గాలికొదిలేశారు. సమీకృత గురుకులాలకు మాత్రం రూ. 11,600 కోట్లు కేటాయించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వం విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి.
– సురేష్, తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025


