ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
అభివృద్ధిలో వెనకబడిన మెతుకుసీమ వడివడిగా పురోగతి దిశగా సాగుతోంది. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాకు సుమారు రూ. 1,400 కోట్ల పైచిలుకు నిధులు విడుదల అయ్యాయి. వీటితో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి.
– మెదక్‌జోన్
కొనసాగుతున్న
మెదక్ – సిద్దిపేట
రహదారి పనులు
మెదక్ నుంచి సిద్దిపేట వరకు 67 కిలోమీటర్ల 765 (డీజీ) రెండు లేన్ల రోడ్డు నిర్మాణం కోసం రూ. 800 కోట్లు మంజూరు కాగా, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెదక్, పాతూర్, అక్కన్నపేటలో పనులు చేయాల్సి ఉంది. అలాగే రామాయంపేట అటవీ ప్రాంతంలో కొంతమేర పనులు నిలిచిపోయాయి. అలాగే రామాయంపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి రూ. 205 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ చర్చి అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరు కాగా, పనులు కొనసాగుతున్నాయి. ఏడుపాయల కమాన్ నుంచి ఆలయం వరకు 7 కిలో మీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 35 కోట్లు మంజూరయ్యాయి. అలాగే మెడికల్ కాలేజీ భవనం, వసతి గృహ నిర్మాణాలకు రూ. 180 కోట్లు, నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు కాగా, ఇటీవల టెండర్ ప్రక్రి య సైతం పూర్తి అయింది. మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు పనులు ప్రారంభించారు.
రూ. 1,400 కోట్లు మంజూరు
మెడికల్, నర్సింగ్ కాలేజీలనిర్మాణ పనులు ప్రారంభం
నాలుగు లేన్ల రోడ్లతోతీరనున్న ఇబ్బందులు
ఆర్వోబీకి అడుగులు
చేగుంట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి రూ. 47 కోట్లు మంజూరు కాగా, ఇటీవల విద్యుత్, ఆర్‌అండ్‌బీ, మిషన్ భగీరథ, అటవీ, పీఆర్, పోలీస్‌శాఖల అధికారులతో కలిసి ఎంపీ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనాల రూటు మళ్లించి పనులకు ఎలాంటి ఆటంకం కాకుండా చర్యలు చేపడుతున్నారు. చేగుంట వద్ద రైల్వేగేట్ పడిన ప్రతీసారి వాహ నాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అనేక సమస్యలకు పరిష్కారం లభించనుంది. అలాగే నేషనల్ హైవే (44) వడియారం బైపాస్ రోడ్డు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 30 కోట్లు మంజూరయ్యా యి. కాగా టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
ఏడాదిలో మెతుకుసీమకు నిధుల వరద
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


