జీవాలకు టీకాలు తప్పనిసరి
మనోహరాబాద్(తూప్రాన్): జీవాలకు సీజనల్ వ్యాధులు రాకుండా రైతులు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య సంచాలకుడు వెంకటయ్య అన్నారు. శనివారం మ ండలంలోని కాళ్లకల్‌లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జీవాలకు మందుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అంతకుముందు సర్పంచ్ నవ్య నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తూప్రాన్ ఉమ్మడి మండల పశు వైద్యాధికారి లక్ష్మి, ఉప సర్పంచ్ ప్రవీణ్, సిబ్బంది రవి, మల్లేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


