విద్యార్థులు ఇష్టంగా చదవాలి
చిలప్‌చెడ్(నర్సాపూర్): విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని డీఈఓ వి జయ అన్నారు. శనివారం మండల పరిధిలోని చిట్కుల్ శివారులో గల కేజీబీవీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్నిరంగాల్లో ముందుకు సాగాలన్నారు. ఎంఈఓ విఠల్ మాట్లాడుతూ.. కేజీబీవీలో విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నారన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ అఖిల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచండి
చిలప్‌చెడ్(నర్సాపూర్): సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విద్యుత్‌శాఖ ఈఈ (సివిల్) సుకుమార్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చండూర్ శివారులో నిర్మి స్తున్న సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.1.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చేనెల 15 వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో ఎలాంటి లోపం జరగకూడదని ఆదేశించారు. ఆయన వెంట చిలప్‌చెడ్ విద్యుత్‌శాఖ ఏఈ రాకేశ్, కాంట్రాక్టర్ విష్ణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏడుపాయల టెండర్ల ఆదాయం రూ. 2.01 కోట్లు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయలలో శనివారం సీల్డ్, బహిరంగ టెండర్లు నిర్వహించగా రూ. 2.01 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థానం వద్ద కొబ్బరికాయలు విక్రయించేందుకు రూ. 1,10,30,000 కోట్ల పాట పాడి ధరంకర్ లింగాజి, అమ్మవారి ఒడి బియ్యం రూ. 91 లక్షలకు జనార్దన్‌రెడ్డి టెండర్ కై వసం చేసుకున్నా రు. కాగా దేవస్థానం వద్ద పూజా సామగ్రి, జాతరలో ఎగ్జిబిషన్ నిర్వహణకు వేలంలో ఎవ రూ పాల్గొనకపోవటంతో వాయిదా వేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుధాకర్‌రెడ్డి, ప్రధాన అర్చకులు శంకరశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
కోతుల బెడదకు..
చింపాంజీ వేషం
కౌడిపల్లి(నర్సాపూర్): మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్పంచ్ వెంకటమ్మ వినూత్నంగా ఆలోచించింది. శనివారం ఓ వ్యక్తికి చింపాంజీ వేషం వేయించి గ్రామంలో కోతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిప్పింది. దీంతో కోతులు భయంతో పారిపోయాయి. కోతులు గ్రామంలోకి తిరిగి వస్తే ఇదే ప్రణాళికను అమలు చేస్తామన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మెదక్ మున్సిపాలిటీ: నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. ప్రజలంతా పోలీసుశాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈనెల 31 రాత్రి 8 గంటల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేసి పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.


