కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Mar 1 2025 8:05 AM | Updated on Mar 1 2025 8:02 AM

ఝరాసంగం(జహీరాబాద్‌): శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలు, ముత్యాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విఘ్నేశ్వరుని పూజతో ప్రా రంభించి.. జీలకర్ర బెల్లం, మాంగల్య ధారణ, కన్యాదాన తంతు, తలంబ్రాలు, మహామంగళ హారతితో ముగించారు. ఉదయం సమయంలో అగ్నిగుండం ప్రవేశం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివ రుద్రప్ప, ఉమ్మడి మెదక్‌ జిల్లా మాజీ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సునితా పాటిల్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌ రావు పాటిల్‌, సీడీసీ మాజీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, సర్పంచ్‌ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

కల్యాణం.. కమనీయం1
1/1

కల్యాణం.. కమనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement