వస్తారా.. రారా..?

- - Sakshi

కండువా మార్చిన నాయకులతో వెళ్లని కేడర్‌..

కార్యకర్తల వైఖరితో నేతల ఇబ్బందులు!

తలలు పట్టుకుంటున్న నాయకులు

సాక్షి, మెదక్‌: టికెట్లు ఆశించి భంగపడిన నేతలు కొందరు, పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని మరికొందరు, ఇలా చాలా మంది వివిధ పార్టీల కండువాలు మార్చారు. అయితే, వారికి సంబంధించిన కేడర్‌ మాత్రం తమతోపాటు రాకపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమ వెంట వస్తే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీలు సైతం ఇస్తున్నారు. అది కూడా కుదరకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల్లో కండువాలు మార్చిన నేతలు చాలా మందే ఉన్నారు.

వీరితోపాటు వెళ్లడానికి కార్యకర్తలు మాత్రం వెనుకడుగు వేశారు. దీంతో ‘‘నిన్న, మొన్నటి వరకు నా వెంట ఉండి, పార్టీ మారాక నాతో రావా, నీ సంగతి చూస్తా’’అంటూ పార్టీ మారిన నాయకులు ధమ్‌కీ ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల నర్సాపూర్‌లో ఓ పార్టీనేత ఎమ్మెల్యే టికెట్‌ ఆశించగా అతడికి టికెట్‌ లభించలేదు. వెంటనే మరో పార్టీలోకి జంప్‌ అయ్యాడు. కానీ, ఆ నాయకుడి వెంట కేడర్‌ మాత్రం వెళ్లలేదు. పార్టీ సిద్ధాంతం నచ్చి వారు ఆ పార్టీతోనే కొనసాగుతున్నారు. దీంతో ఆ నాయకుడు ‘‘నా వెంట మీరు రావాల్సిందే’’అని పలు వురు కార్యకర్తలను బెదిరించగా వారు వాగ్వాదానికి దిగారు.

మర్యాద కరువు..
పార్టీలు మారిన నేతల వెంట కేడర్‌ వెళ్లకపోవడంతో కొత్తపార్టీలో ఆ నేతకు మర్యాద కరువైందని, ఎవరూ తమకు విలువ ఇవ్వడంలేదని జంప్‌జిలానీలు తలలు పట్టుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ప్రత్యర్థులుగా తిట్టుకున్న నేతలు ఒకేపార్టీలో చేరడంతో బలాలు, బలగాల లెక్కలపై పంచాయితీలు పెట్టుకుంటూ, జంప్‌ జిలానీలను సీనియర్‌ నాయకులు సూటిపోటీ మాటలతో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు మారిన నేతలు కొత్త పార్టీలో ఇమడలేక నామూ షీగా ఫీలవుతున్నట్లు సమాచారం.
ఇవి చదవండి: కరీంనగర్‌కు రూ.9వేల కోట్లు తెచ్చా! : బండి సంజయ్‌

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-11-2023
Nov 25, 2023, 07:55 IST
సాక్షి, కరీంనగర్‌: ‘కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.9వేల కోట్లు తెచ్చిన. మీ ఆశీర్వాదంతో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కోసం...
25-11-2023
Nov 25, 2023, 04:44 IST
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్‌కు ఎంబీటీ పోరు తప్పడం లేదు. ఏకంగా యాకుత్‌పురా అసెంబ్లీ స్థానంలో తీవ్రమైన పోటీ...
25-11-2023
Nov 25, 2023, 04:44 IST
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు దూసుకెళ్తున్నాయి. రాజకీయ నేతల సుడిగాలి పర్యటనల్లో గిరికీలు కొడుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల కంటే...
24-11-2023
Nov 24, 2023, 17:54 IST
సాక్షి, నారాయణఖేడ్‌: బీఆర్‌ఎస్‌ ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తే కాంగ్రెస్ వాళ్లకు గుండెలో గుబులు పుడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఖేడ్‌...
24-11-2023
Nov 24, 2023, 15:59 IST
టేబుల్‌ మీద ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్లే తెలంగాణ కేబినెట్‌లో మంత్రులు అవుతూ..
24-11-2023
Nov 24, 2023, 15:17 IST
సాక్షి,హైదరాబాద్‌ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...
24-11-2023
Nov 24, 2023, 13:58 IST
కాంగ్రెస్‌ వల్ల 58 ఏళ్లు తెలంగాణ గోసపడింది. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయింది. 
24-11-2023
Nov 24, 2023, 13:08 IST
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెం‍బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే...
24-11-2023
Nov 24, 2023, 12:10 IST
తుర్కపల్లి: అవినీతి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని...
24-11-2023
Nov 24, 2023, 11:49 IST
మహబూబ్‌నగర్‌: ఇక్కడి నుంచి కర్ణాటక ఐదు కిలో మీటర్ల దూరమే.. ఎమ్మెల్యే రామన్న నాలుగు బస్సులు ఏర్పాటు చేస్తాడు.. అందరూ...
24-11-2023
Nov 24, 2023, 11:41 IST
ఖమ్మంలో తుమ్మల కోసం కాకుండా పువ్వాడ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న.. 
24-11-2023
Nov 24, 2023, 11:41 IST
శాలిగౌరారం: 80 సంవత్సరాలు పైబడిన వారితో పాటు అంగవైకల్యం కలిగిన వారివద్ద నుంచి ఓట్లను స్వీకరించేందుకు మండలానికి వచ్చిన ఎన్నికల...
24-11-2023
Nov 24, 2023, 10:40 IST
మెదక్‌/తూప్రాన్‌: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌...
24-11-2023
Nov 24, 2023, 10:34 IST
రాజ్‌నీతి సర్వే సంస్థ తెలంగాణపై తాజాగా తన సర్వే నివేదికను విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) మరోసారి తన...
24-11-2023
Nov 24, 2023, 10:21 IST
సాక్షి,ఆదిలాబాద్‌: బోథ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మార్పు ప్రయోజనమెంతా అనే చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో సాగుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీల ప్రచారం...
24-11-2023
Nov 24, 2023, 10:18 IST
నిర్మల్‌ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్‌ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే...
24-11-2023
Nov 24, 2023, 10:16 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘రాం రామే.. రాజన్న. ఏం సంగతే. ఇయ్యల్ల పొద్దెక్కుతున్న ఓళ్లస్తలేరు.. సలిగూడ రెండొద్దుల సంది జరంత ఎక్కనే ఉన్నదే....
24-11-2023
Nov 24, 2023, 09:46 IST
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఎల్‌ఓలు ఓటర్‌ చీటీలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఓటరు చీటీలు అందకుంటే ఆగం...
24-11-2023
Nov 24, 2023, 09:36 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
24-11-2023
Nov 24, 2023, 09:33 IST
ప్రధాన పార్టీలేమో వ్యూహాత్మక ఎత్తుగడల నడుమ కీలక నేతల పోరు తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. 

Read also in:
Back to Top