
వర్గల్ సరస్వతి అమ్మవారు
వర్గల్(గజ్వేల్): చదువుల తల్లి నెలవు వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం గురువారం మూల మహోత్సవ వైభవంతో అలరారింది. జన్మనక్షత్ర వేళ తెల్లవారుజామున ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారి మూలవిగ్రహానికి విశేష పంచామృతాభిషేకం జరిపారు. సర్వాలంకార శోభితులైన అమ్మవారికి భక్తజన సామూహిక లక్షపుష్పార్చన, లలితాపారాయణం, సప్తశతీ, చండీ పారాయణం, చండీ హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. కుంకుమార్చన చేశారు. వేడుకలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.