వైద్యులు అందుబాటులో ఉండాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
టేక్మాల్(మెదక్)/పాపన్నపేట: ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. శుక్రవారం టేక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యా ధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యలపై ఆరా తీశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పా పన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఎన్ని ప్రసవాలు అయ్యాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు ఎక్కువ అయ్యేలా చూడాలన్నారు. అత్యవసరమైతే తప్ప సిజేరియన్లు చేయవద్దన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా మెరుగైన వైద్య సే వలు అందించాలన్నారు. ఆయన వెంట సీహెచ్‌ఓ చందర్, వైద్య సిబ్బంది ఉన్నారు.


