రైతులు ఇబ్బంది పడొద్దు
● వచ్చే యాసంగి నాటికిపంట కాల్వల నిర్మాణం చేపట్టాలి ● అధికారులతో మాజీమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్/చిన్నకోడూరు: వచ్చే యాసంగి నాటికి శాశ్వత పంట కాల్వల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారితో సమీక్ష నిర్వహించారు. గత యాసంగిలో ప్రభుత్వం సరైన ప్రణాళికలను చేపట్టకపోవడంతో రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. తన సొంత డబ్బులతో తాత్కాలిక కాల్వలు తీసి సాగు నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పంట పొలాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి అవసరమైన భూసేకరణ చేపట్టాలని కోరారు. భూసేకరణ, కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలన్నారు. ఇర్కోడ్, చందలాపూర్‌లో నిర్మించే లిఫ్ట్ పనులు వేగవంతం కావాలన్నారు. నియోజకవర్గ పరి ధిలోని పెండింగ్ చెక్ డ్యాం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈలు గోపాల్‌కృష్ణ, శంకర్, డీఈ చంద్రశేఖర్, అధికారులు శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యాసాగర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నకోడూరు రైల్వేస్టేషన్ నిర్మాణంతో పాటు విఠలాపూర్ వరకు రైల్వేలైన్ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.


