కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దాం
చేగుంట(తూప్రాన్): కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య పిలుపునిచ్చారు. శుక్రవా రం మండలంలోని పొలంపల్లిలో కేవల్ కిషన్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కేవల్ కిషన్ పేద ప్రజల కోసం తన సొంత భూములను సైతం విరాళంగా అందించి చెరువులను తవ్వించాడని పేర్కొన్నారు. భూస్వాముల కుట్రలకు బలైన డిసెంబర్ 26న ఏటా ప్రజలు జాతర నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో చేగుంట వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, సభ్యులు మల్లేశం, బాలమణి, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి, జీఎంఆర్ కాలనీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. కాలుష్య ప్రాంతమైన కాజీపల్లి జీఎంఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలుష్యానికి గురైన కాల్వలు చెరువులను పరిశీలించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవ సరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రమాకాంత్, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్(సంగారెడ్డి): శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్న కార్మికులపై కేంద్ర ప్రభుత్వం పగబట్టి, కార్పొరేట్లకు వ్యాపారాలు అప్పజెప్పుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శుక్రవారం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ఐబీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ నాడు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆదుకోవాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం మతంపైన శ్రద్ధ పెడుతూ ప్రజలు, కార్మికులకు అన్యా యం చేస్తుందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీ రాంజీ పేరు చేర్చి చట్టాన్ని బలహీనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్, అధ్యక్షుడు రాజయ్య, సీఐటీయూ నాయకులు రాజయ్య, మాణిక్ పాండురంగారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి, పాత చట్టాలనే పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దేశవ్యాప్త నిరసనలో భాగంగా పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రైతు సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంపదను దోచి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దాం
కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దాం


