తొగుట సీఐ కమలాకర్
తొగుట(దుబ్బాక): రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సీఐ కమలాకర్ సూచించారు. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో మంగళవారం సాయంత్రం కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఓటువేసి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమన్నారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీస్ కంట్రోల్ రూం మొబైల్ నంబర్ 8712667100 లేదా 100కు కాల్ చేయాలని సూచించారు. డబ్బులు, మద్యానికి ఓటును అమ్ముకోవద్దని, మీకు నచ్చిన అభ్యర్థికి నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. గ్రామాల్లో వివిధ పార్టీలు నిర్వహించే ప్రచారాన్ని అడ్డుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారా మిలటరీ దళాలతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.కార్యక్రమంలో ఎస్‌ఐ లింగం, సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నారు.