కరాటేతో ఆత్మస్థైర్యం పెంపు
మనోహరాబాద్(తూప్రాన్): కరాటేతో ఆత్మస్థైర్యం పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ గార్డెన్‌లో సన్‌షైన్ షాటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర కరాటే పోటీలను నిర్వహించారు. కాగా పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో కరాటే నేర్చుకోవాలని సూచించారు. అనంతరం పోటీలు నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ మల్లేశ్, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ను మైనంపల్లి హన్మంతరావు సన్మాని ంచారు. అనంతరం విజేలతకు సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన గ్రాండ్ మాస్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


