ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్‌రాజ్
రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వి ద్య అందుతుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని ప్రగతి ధర్మారంలో బీసీ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుపేదలకు సరైన వైద్యసేవలు అందేవిధంగా కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆస్పత్రుల తనిఖీ చేపట్టామన్నారు. కలెక్టరేట్ నుంచే సీసీ కెమెరాల ద్వారా అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.అనంతరం నార్సింగి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు 65 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు క ష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.


