కలిసికట్టుగా ముందుకెళ్దాం
సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్‌రెడ్డి
వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్రంలో సర్పంచ్‌లు ఎదుర్కొనే సమస్యలపై పార్టీలకతీతంగా పోరాటం చేసి కలిసికట్టుగా పరిష్కరించుకుందామని సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాసాయిపేట మండలం హకింపేట శివారులోని ఓ రిసార్ట్‌లో జిల్లా కార్యవర్గాన్ని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్నయాదవ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి రాజిరెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీ సర్పంచ్ కల్యాణ్‌ను జిల్లా అధ్యక్షుడిగా, మాసాయిపేట స ర్పంచ్ కిష్టారెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంగళపర్తి సర్పంచ్ సంధ్యను ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నిక పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆశాదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో సర్పంచ్‌లుగా ఎన్నికై న వారిపై బరువు, బాధ్యతలు పెరిగాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన ప్రత్యేక నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులను గ్రామాల అభివృద్ధికి సక్రమంగా వినియోగించుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ముఖ్య సలహాదారులు వీరభద్ర ఆచార్య, పాండుగౌడ్‌తో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పాల్గొన్నారు.


