అందుబాటులో ఉల్లి నారు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో ఉల్లి నారు

Jan 5 2026 11:00 AM | Updated on Jan 6 2026 1:20 PM

అందుబ

అందుబాటులో ఉల్లి నారు

అందుబాటులో ఉల్లి నారు కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని తునికి వద్ద గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ఉల్లిగడ్డ నారు అందుబాటులో ఉందని కేవీకే హార్టికల్చర్‌ శాస్త్రవేత్త శ్రీనివాస్‌ తెలిపారు. ఇందులో బీమకిరణ్‌ రకం ఉల్లి నారు అందుబాటులో ఉండగా, ఉల్లిగడ్డ గోదుమ రంగులో ఉంటుందన్నారు. ఒక్కోగడ్డ 100 నుంచి 120 గ్రాముల వరకు పెరుగుతుందన్నారు. ఆరునెలల వరకు మన్నికగా ఉంటుందని చెప్పారు. అవసరం ఉన్న రైతులు కేవీకేలో సంప్రదించాలని సూచించారు. రెండో రోజు టెట్‌ ప్రశాంతం నర్సాపూర్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రెండో రోజు ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ విజయ తెలిపారు. బీవీ రాజు ఇంజనీరింగ్‌ కాలేజీలో కొనసాగుతున్న పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం పరీక్షకు 100 మందికి గాను 48 మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 100 మందికి 71 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు పరీక్షలకు కలిపి 81 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వివరించారు. లూయిస్‌ బ్రెయిలీకి నివాళి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు విజన్‌ లేదు

నూతన కార్యవర్గం

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా జ్యుడీషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగాయి. అధ్యక్షుడిగా ఖాజామొహినొద్దీన్‌, ప్రధాన కార్యదర్శిగా రమేశ్‌, ఉపాధ్యక్షులుగా సునీతా, రాజేశ్‌, కిరణ్‌కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా శ్యాంకుమార్‌, జాయింట్‌ సెక్రటరీగా భవాని, వినయ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా సమీయొద్దీన్‌, రాజు, మహిళా ప్రతినిధిగా స్వాతి ఎన్నికయ్యారు.

మెదక్‌ కలెక్టరేట్‌: అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన నవయుగ వైతాళికుడు లూయిస్‌ బ్రెయి లీ అని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక యూనియన్‌ జిల్లా కార్యదర్శి యశోద అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో లూయిస్‌ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రెయిలీ లిపి అందుబాటులోనికి వచ్చాకే అంధులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. సమాజంలో ప్రతి సంవత్సరం 30 వేల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యాలు, కార్యదర్శి యశోద, గౌరవ అధ్యక్షులు మల్లేశం, ఉపాధ్యక్షులు యాదగిరి, రాష్ట్ర మహిళా సభ్యులు కవిత, సహాయ కార్యదర్శి దుర్గ, శ్రీదేవి, వినోద్‌, దుర్గమ్మ, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ రఘునందన్‌రావు

పటాన్‌చెరు టౌన్‌: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలకు విజన్‌ లేదని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని ఐబీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితో కలసి ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నదీ జలాల అంశంపై తె లంగాణకు ఎన్ని టీఎంసీల నీరు సరిపోతాయో అంగీకరించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీలో పెట్టిన సంతకం తాలూకూ పత్రాలు ప్రజలముందు ఉంచామని చెప్పారు. తెలంగాణకు నష్టం చేయడంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు దొందూ దొందేనని విమర్శించారు.

అందుబాటులో ఉల్లి నారు 
1
1/3

అందుబాటులో ఉల్లి నారు

అందుబాటులో ఉల్లి నారు 
2
2/3

అందుబాటులో ఉల్లి నారు

అందుబాటులో ఉల్లి నారు 
3
3/3

అందుబాటులో ఉల్లి నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement