రాష్ట్రస్థాయికి విద్యార్థిని ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయికి విద్యార్థిని ఎంపిక

Nov 15 2023 4:36 AM | Updated on Nov 15 2023 4:36 AM

- - Sakshi

హత్నూర (సంగారెడ్డి): మండల కేంద్రమైన హత్నూరాలోని కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అంకిత డప్పు కళాకారునిగా రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన కళా ప్రదర్శనలో అంకిత జిల్లా స్థాయిలో మొదటి స్థానం దక్కించుకొని రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు విజయలక్ష్మి తెలిపారు.

సీఎం సభాస్థలిని

పరిశీలించిన సీపీ

చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 18న పట్టణ కేంద్రంలో సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వెనుక గల సభాస్థలం, పార్కింగ్‌ ప్రదేశాలను మంగళవారం సీసీ శ్వేత పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ రఘుపతిరెడ్డి, స్థానిక ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, ఎస్బీ ఎస్‌ఐ బాలకృష్ణ పాల్గొన్నారు.

సీసీ కెమెరాల చోరీ

మిరుదొడ్డి(దుబ్బాక): నేరాలు, దొంగతనాల యంత్రణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 3.50 లక్షల విలువ చేసే సీసీ కెమెరాలను చోరీ చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని అల్వాల, చెప్యాల క్రాస్‌ రోడ్డులో ఉన్న టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ బాలుర ఉన్నత పాఠశాల/జూనియర్‌ కళాశాలలో జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాల/కళాశాలలో దొంగతనాల నియంత్రణ కోసం 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా సోమవారం రాత్రి దొంగలు పాఠశాల ఆవరణలోకి చొరబడి ప్రధాన సీసీ ఫుటేజీ కేబుల్‌ను కట్‌ చేశారు. దీంతో పాఠశాలతో పాటు హాస్టల్‌లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం ఆగిపోయాయి. దొంగలు 15 సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. కాగా ప్రిన్సిపాల్‌ ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

పేదల సంక్షేమమే ధ్యేయం

ములుగు(గజ్వేల్‌): ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగుతోందని బీఆర్‌ఎస్‌ మండల పార్టీ ఇన్‌చార్జి రవీందర్‌రావు, వంటిమామిడి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జహంగీర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ బట్టు అంజిరెడ్డి అన్నారు. మండలంలోని తున్కిబొల్లారంలో గజ్వేల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సీఎం కేసీఆర్‌ తరపున మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జయమ్మ అర్జున్‌గౌడ్‌, జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ సలీం, ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నరేష్‌గౌడ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన కార్యదర్శి జుబేర్‌పాష, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బాబుగౌడ్‌, ఉపాధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, మల్లేష్‌ యాదవ్‌, అయిలయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

తున్కిబొల్లారంలో మాట్లాడుతున్న అంజిరెడ్డి1
1/3

తున్కిబొల్లారంలో మాట్లాడుతున్న అంజిరెడ్డి

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ బాలుర 
పాఠశాల/కళాశాల 2
2/3

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ బాలుర పాఠశాల/కళాశాల

విద్యార్థిని అంకిత 
3
3/3

విద్యార్థిని అంకిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement