
రోడ్డుషోలో కేటీఆర్
సంగారెడ్డి: సంగారెడ్డికి మెట్రో రైలు, ఐటీ హబ్ నిర్మాణం జరగాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను గెలిపించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం కంది నుంచి సంగారెడ్డి వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ మధ్య రోడ్ షో గంజిమైదాన్ వరకు చేరుకొని ముగిసింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లా డారు. ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ సన్నాసులకు ఒక్క చాన్స్ ఎందుకివ్వాలి? అని ప్రశ్నించారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి తాను గెలుస్తానని, బీఆర్‌ఎస్‌లో చేరుతానని చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే చింతా ప్రభాకర్‌కు టికెట్ ఎందుకు ఇస్తామని, గెలిపించమని ఎందుకు కోరుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు జరిగిన భారీ బైక్ ర్యాలీ, రోడ్ షోను చూస్తే ప్రభాకర్ గెలుపు తేలికవుతోందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలో వచ్చిన వెంటనే కేసీఆర్ భరోసా పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.
● బహిరంగ సభలో మంత్రి కేటీఆర్