21న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

21న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య

మంచిర్యాలక్రైం: ఈ నెల 21న నిర్వహించే ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య అన్నారు. స్థానిక జిల్లా ప్రధాన న్యాయస్థానంలో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో జిల్లా 14వ స్థానంలో ఉందని, అన్ని కోణాల్లో చర్యలు తీసుకుని రాజీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, మందమర్రి న్యాయస్థానాల్లోనూ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తామని అన్నారు. జిల్లాకు ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కోర్టు, కమర్షియల్‌ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసిందని, ఎస్సీ, ఎస్టీ కేసులు, కమర్షియల్‌ కేసులు ఇక్కడే పరిష్కరించుకోవచ్చని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే సలహా, సహాయాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు నిరోష, కృష్ణతేజ, న్యాయవాదులు మంజుల, అల్లం శ్రీనివాస్‌, రమణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement