అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

● హైదరాబాద్‌లో ఉండి అభివృద్ధికి పాటుపడుతున్నా.. ● బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌

బెల్లంపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు మంజూరు చేస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. బుధవారం బెల్లంపల్లి బాబుక్యాంపు బస్తీలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని పేదలకు మంజూరైన చేయూత పథకం పింఛన్‌ మంజూరు పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య, ఆర్డీవో కిషన్‌, మున్సిపల్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌లు దావ స్వాతి, రత్నం సుకుమారితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని బెల్లంపల్లి, తాండూర్‌, కన్నెపల్లి, వేమనపల్లి, కాసిపేట, నెన్నెల, భీమిని మండలాల్లో 2,927మందికి పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హత కలిగిన ఎవరికై నా పింఛన్‌ మంజూరు కాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, అవసరమైతే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. వచ్చే రెండేళ్లలో బెల్లంపల్లి అభివృద్ధికి పాటుపడుతానని అన్నారు. తాను స్థానికంగా ఉండడం లేదని కొందరు తప్పు డు ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్‌లో ఉండి అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని వివరించా రు. బీఆర్‌ఎస్‌ నాయకుల దుష్ప్రచారంపై మాట్లాడబోనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాగంశెట్టి సత్యనారాయణ, కమిషనర్‌ తన్నీరు రమేష్‌, ఎంపీడీవోలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement