బాలికలకు కరాటే శిక్షణ | - | Sakshi
Sakshi News home page

బాలికలకు కరాటే శిక్షణ

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

● ఆత్మరక్షణకు తర్ఫీదు ● జిల్లాలో రెండు వేల మంది

చెన్నూర్‌: విద్యార్థి దశ నుంచే బాలికలు కరాటేలో శిక్షణ పొందుతున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. గత రెండు నెలలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో బాలికల్లో మనోస్థైర్యం నింపడానికి మార్గం సుగమమైంది. తరగతి గది నుంచే ఆత్మరక్షణలో శిక్షణ పొందుతూ చిచ్చర పిడుగుల్లా తయారవుతున్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు ఎస్‌జీఎఫ్‌ కరాటే పోటీల్లోనూ రాణిస్తున్నారు. జిల్లాలో 19 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో సుమారు రెండు వేల మంది విద్యార్థినులు కరాటేలో శిక్షణ పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం నియమించిన 19మంది ఇన్‌స్ట్రక్టర్లు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మూడు నెలల ఇచ్చే కరాటే శిక్షణకు విద్యార్థినులు ఆసక్తి చూపిస్తున్నారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు

పాఠశాలలు సంఖ్య బాలురు బాలికలు మొత్తం

పాఠశాలలు 7 890 450 1,340

లోకల్‌ బాడీ 101 7,723 6,305 14,028

కేజీబీవీ 18 0 5,300 5,300

టీజీఆర్‌ఐఈఎస్‌ 01 545 0 545

మోడల్‌ స్కూల్స్‌ 05 1,384 1,679 3,063

మొత్తం 132 10,542 13,734 24,276

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement