● తక్కువ ధరతో రైతుల నుంచి కొనుగోళ్లు ● రైతుల పేర్లతోనూ పొరుగు రాష్ట్రంలో విక్రయాలు ● ప్రతీరోజు మహారాష్ట్రకు వాహనాల్లో తరలింపు ● మార్కెటింగ్‌ శాఖ ఆదాయానికి గండి | - | Sakshi
Sakshi News home page

● తక్కువ ధరతో రైతుల నుంచి కొనుగోళ్లు ● రైతుల పేర్లతోనూ పొరుగు రాష్ట్రంలో విక్రయాలు ● ప్రతీరోజు మహారాష్ట్రకు వాహనాల్లో తరలింపు ● మార్కెటింగ్‌ శాఖ ఆదాయానికి గండి

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

● తక్కువ ధరతో రైతుల నుంచి కొనుగోళ్లు ● రైతుల పేర్లతోనూ పొరుగు రాష్ట్రంలో విక్రయాలు ● ప్రతీరోజు మహారాష్ట్రకు వాహనాల్లో తరలింపు ● మార్కెటింగ్‌ శాఖ ఆదాయానికి గండి

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు వ్యాపారుల పత్తి ‘పంట’ పండుతోంది. తక్కువ ధరకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌ ఫీజు సైతం ఎగవేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభం కాగా, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667 కంటే అధికంగా పొరుగున మహారాష్ట్రలో రూ.9వేల వరకు పలుకుతోంది. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలతోపాటు పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల ప్రైవేటు వ్యాపారులు కూడా పత్తి తరలిస్తున్నారు. ఫీజు మాత్రం కట్టకుండా తప్పించుకుంటున్నారు. దీంతో మార్కెటింగ్‌ శాఖ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి విలువకు ఒక శాతం ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి. వందల క్వింటాళ్లు పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నా పట్టింపు కరువైంది. ఇదే అదునుగా వందలాది వాహనాల్లో పెద్దయెత్తున పత్తి తరలిస్తున్నారు.

తనిఖీలు అంతంతే..

ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో పత్తి సీజన్‌ మొదలైంది. సీసీఐలో ధర తక్కువతో రైతులు చా లామంది ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రా మాల్లో రైతుల నుంచే నేరుగా ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. లైసెన్స్‌ తీసుకున్న ప్రైవేటు వ్యాపారులు సాగిస్తున్న దందాపైనా తని ఖీలు అంతంత మాత్రంగానే మారాయి. తూకం, తేమ నిఘా కొరవడింది. దీంతో ఆయా మార్కెటింగ్‌ కమిటీల పరిధిలో భారీ మొత్తంలో ఆదాయం కోల్పోతోంది. ఆసిఫాబాద్‌ జిల్లా పరిధిలో ఆసిఫాబాద్‌, జైనూర్‌, కాగజ్‌నగర్‌, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, జన్నారం, లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధి లో తనిఖీలు చేయాల్సి ఉంది. సిబ్బంది లేమితో జిన్నింగ్‌ మిల్లులకే పరిమితం అవుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు చేస్తున్న కొనుగోళ్లపై నిఘా కరువవుతోంది. దీంతో మార్కెటింగ్‌ శాఖ తమ లక్ష్యం మేర ఆదాయాన్ని అందుకోలేకపోతోంది.

హైవేపై చెక్‌పోస్టు ఎలా?

గతంలో రాష్ట్రీయ రహదారిపై ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఉండేవి. ప్రస్తుతం ఎన్‌హెచ్‌–363 అందుబాటులోకి వచ్చాక తనిఖీలు చేయడం ఇబ్బందిగా మారింది. హైవేపై వాహనాలు నిలిపి తని ఖీ చేసే అధికారం ఉండదు. కేవలం మంచిర్యాల జిల్లా పరిధిలో ఇందారం క్రాస్‌, హాజీపూర్‌ మండలం వేంపల్లి వద్ద మాత్రమే పొరుగు జిల్లాల వాహనాలను ఆపి తనిఖీ చేయవచ్చు. ఇక ఆసిఫాబాద్‌ జిల్లాలో కాగజ్‌నగర్‌, జైనూర్‌ పరిధిలో నే వీలు కలుగుతోంది. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్‌ వరకు రెండు జిల్లాల పరిధిలో హైవేపై ఎక్కడా తనిఖీలకు చెక్‌పోస్టులు లేవు. గతంలో వాంకిడిలో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు జరిగేవి. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాహనాలను సైతం అక్కడ నిలిపి పరిశీలించేవారు. హైవేపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసే అధికారం ఎవరికీ లేదు. దీంతో వాహనాల నిలుపుదల కష్టంగా మారింది. కనీసం బారికేడ్లు, స్పీడ్‌బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయరాదు. ఇందుకు ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనలు ఒప్పుకోవు. దీంతో మార్కెటింగ్‌ అధికారులు దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో హైవేపై చెక్‌పోస్టు ఎలా ఏర్పాటు చేస్తారనేది ప్రశ్నగా మారింది.

చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తాం

జాతీయ రహదారి ఏర్పాటుతో అంతర్రాష్ట్ర పరిధిలో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేయలేకపోతున్నాం. ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. హైవేపై తనిఖీలు చేసేలా ఏర్పాట్లు చేస్తాం.

– అష్పక్‌ అహ్మద్‌, ఆసిఫాబాద్‌ జిల్లా

మార్కెటింగ్‌ కమిటీ ఆఫీసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement