కోటపల్లి: పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తోందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం ఆయన కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి స్థానిక మోడల్ స్కూల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ తా ను ఎంపీగా ఉన్నప్పుడు ఈ మోడల్ స్కూల్ ఏర్పా టు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు మంచి ఫలితా లు సాధిస్తే బహుమతులు అందిస్తానని హామీనిచ్చారు. విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ ఏర్పాటుకు రూ.40లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. నాణ్యత, మెనూ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, నాయకులు పాల్గొన్నారు.
చెన్నూర్‌లో మార్నింగ్‌వాక్
చెన్నూర్/చెన్నూర్‌రూరల్: చెన్నూర్ పట్టణంలోని లైన్‌గడ్డ ప్రాంతంలో మంత్రి వివేక్ బుధవారం మార్నింగ్‌వాక్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మైనార్టీ పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని, ఖబ్రస్తాన్‌కు ప్రత్యేక స్థలం కేటాయించాలని మైనార్టీ యువకులు కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, కోఆప్షన్ సభ్యులు సాహీర్, కాంగ్రెస్ నాయకులు అన్వర్, దాసరి కమలాకర్, శేఖర్, రాంటెంకి పోచం పాల్గొన్నారు.


