మంచిర్యాలటౌన్: ప్రపంచ పోలియో నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా వై ద్యారోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్ పోలియో నివారణ అవగాహన పోస్టర్‌ను రెడ్‌క్రాస్ సొసైటీ, లయ న్స్ క్లబ్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. మంచిర్యా లను పోలియో రహిత జిల్లాగా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి, ఉప వైద్యాధికారి సుధాకర్ నాయక్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, ఎండీ రషీద్, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు.


