దండేపల్లి: ఎల్‌నినో ప్రభావంతో రోజురోజుకూ ఉ ష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి మ ట్టం తగ్గుతోంది. ముందస్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కాపాడుతున్నారు. కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం 695 అడుగుల నీటి ని ల్వ ఉంది. దీంతో ప్రస్తుత వానాకాలం సాగుకు క డెం ఆయకట్టు కింద చివరి దాకా నీరందడం కొద్ది గా ఇబ్బందిగా మారింది. దీంతో ఆయకట్టు రైతులను వానాకాలం సాగునుంచి గట్టెక్కించేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చొరవ తీసుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి కడెం చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గూడెం ఎత్తిపోతల నుంచి నీళ్లివ్వాలని కోరారు. దీంతో శుక్రవారం సా యంత్రం నుంచి గూడెం ఎత్తిపోతల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు.
గూడెం లిఫ్ట్ నీటిని డీ–30 నుంచి 42వరకు..
మరో రెండు తడుల నీటితో వానాకాలం పంట చేతికి రానుంది. దీంతో కడెం ఆయకట్టు కింద పంటల సాగుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆయకట్టు కింద వానాకాలంలో సుమారు 53వేల ఎకరాలకు పైగా పంటలు సాగు చేశారు. కడెం ప్రాజెక్టు పరిధిలో 42 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో చివరి ఆయకట్టుకు సాగు నీరందడం కొంత ఇబ్బందిగా మారింది. రైతులను సాగునీటి ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు డీ–1 నుంచి డీ–28 వరకు కడెం ప్రాజెక్టు నీటిని, డీ–30 నుంచి 42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తున్నారు. దీంతో కడెం ఆయకట్టు కింద వానాకాలం సాగు నుంచి రైతులు గట్టెక్కనున్నారు.
పొదుపుగా వాడుకోవాలి
ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ప్రస్తుతం కడెం ఆయకట్టు చివరిదాకా ప్రాజెక్టు నీరు అంద డం ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతులకు వానాకాలం సాగుకు ఇబ్బంది లేకుండా కడెం నీటిని డీ–1 నుంచి డీ–28 వరకు అందిస్తుండగా, గూడెం ఎత్తిపోతల నీటిని డీ–30నుంచి 42వరకు అందిస్తున్నాం.
– ప్రవీణ్, కడెం ప్రాజెక్ట్ ఈఈ


