ఇంకా టెండర్ ప్రక్రియ పూర్తి కాని వైనం
కొనసా... గుతున్న విస్తరణ పనులు
ఇబ్బందుల్లో చెన్నూర్ పట్టణ ప్రజలు
చెన్నూర్: పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు రావి చెట్టు వరకు రోడ్డు వెడల్పు పనులకు మోక్షం కలగడంలేదు. రోడ్డు విస్తరణలో భా గంగా భవనాల కూల్చివేత నత్తనడకన సాగుతోంది. రోడ్డు నిర్మాణానికి రూ.5.50 కోట్ల పుష్కర నిధులు మంజూరు కాగా, టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్లు సిండికేట్ అయినట్లు ప్రచారం సాగుతోంది. గత నెలలో టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా నేటికీ ఆ ఊసే లేదు. భవనాల కూల్చివేత ప నులు ప్రారంభించి ఆరు నెలలవుతుండగా వ్యాపారులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పనుల్లో తీవ్ర జాప్యం
ఇరువైపులా భవనాలు కూల్చి వేయడంతో రోడ్డుపై నే నేటికీ విద్యుత్ స్తంభాలున్నాయి. టెండర్ ప్రక్రి య పూర్తయ్యాక స్తంభాలు అడ్డుగా ఉన్నాయని కాంట్రాక్టర్ పనులు మరింత ఆలస్యం చేసే అవకాశముంది. మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు స్తంభాలు తొలగించేలా చర్యలు చేపడితే రోడ్డు నిర్మాణ పనులు సాఫీగా జరిగే అవకాశముంటుంది. రోడ్డును 55 ఫీట్లు విస్తరించాలని నిర్ణయించడంతో 95శాతం మంది వ్యాపారులు షాపులను స్వ చ్ఛందంగా తొలగించారు. మరో 2శాతం పెద్ద భవనాలు కూల్చివేయడంలో జాప్యం చేస్తుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వ్యాపారులకు ఒక న్యాయం.., చిరు వ్యాపారులకు ఒక న్యాయమా? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప నులు పూర్తి కాకపోవడంతో వ్యాపారాలు కుంటుపడుతున్నాయని వాపోతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించేలా చూడాలని కోరుతున్నారు.


