రక్త పరీక్షలకు నిధులు మంజూరు | - | Sakshi
Sakshi News home page

రక్త పరీక్షలకు నిధులు మంజూరు

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

చెన్నూర్‌: చెన్నూర్‌ ఏరియాస్పత్రిలో రక్త పరీక్షల ఫలితాల్లో తేడాలు వస్తున్నట్లు రోగులు తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 18న ‘రాంగ్‌ రిపోర్ట్‌’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కోటేశ్వర్‌రావు స్పందించారు. చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్‌లో రక్త పరీక్షలకు అవసరమైన రసాయనాలు లేక రోగులను టీహబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. సిస్టంలో టెక్నికల్‌ సమస్య కారణంగా పరీక్షల ఫలితాల్లో తేడాలు రావచ్చని పేర్కొన్నారు. చెన్నూర్‌ ఆస్పత్రిలో రక్త పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన రసాయనాల కోసం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ నిధులు మంజూరు చేశారని వైద్యుడు సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే రక్త పరీక్షలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement