మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలటౌన్: పుష్కర పనులతో పాటు ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్య త పాటించి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని దే వాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆదేశించా రు. శనివారం కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని విశ్వనాథస్వామి ఆలయ పునర్నిర్మాణ, పుష్కరఘాట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటి విడతలో రూ.5కోట్లతో ఆలయ పు నర్నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లండించారు. 2027 లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టిన విశ్వనాథస్వామి, గూడెం సత్యనారా యణస్వామి ఆలయాల పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆలయానికి సంబంధించిన న మూనా పటాన్ని పరిశీలించారు. చేపట్టనున్న పను ల గురించి తెలుసుకున్నారు. పుష్కర ఘాట్ నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా తనఖీ చేసి పలు సూచనలు చేశారు. అంతకుముందు విశ్వనాథస్వామి ఆలయంలో పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని గోదావరి తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని సందర్శించారు. ఆర్డీవో శ్రీనివాస్, ఎండోమెంట్ అ సిస్టెంట్ కమిషనర్ సుదర్శన్, నగర మేయర్ ధర్ని మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి భానేశ్, ఆలయ ఈవో ముక్తారవి, చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కాల భైరవుడికి పూజలు
కోటపల్లి: రత్నాచలకొండ స్వయంభూ శ్రీకాల భైరవస్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు దర్శించుకుని పూజలు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ సుదర్శన్, ఈవోలు రవి, రమేశ్, నాగభూషణం, కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్త శ్యాంసుందర్ తదితరులున్నారు.


