మంచిర్యాలఅగ్రికల్చర్: పీఎం రహత్ పథకం ద్వా రా రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వ రకు ఉచిత చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. శని వారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలి సి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కుమార్ దీప క్, అదనపు కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులతో స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పథకం అమలులో జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, పోలీస్‌శాఖ, ఆస్పత్రులు, జనరల్ ఇ న్సూరెన్స్ కౌన్సిల్ తదితర వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయని పేర్కొన్నారు. పథకం అమలును పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో సంబంధిత అధి కారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. వీడి యో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో మాట్లాడారు. పీఎం రహత్ పథకం అమలు విధానంపై సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సమగ్ర శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు. పథకానికి సంబంధించిన విధివిధానాలు, బాధితుల వివరాల నమోదు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పథకం అ మలులో లోపాలు లేకుండా నిర్దేశించిన విధానాల ను కచ్చితంగా పాటించాలని సూచించారు. డీసీపీ భాస్కర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా రవాణాధికారి, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ సత్యనారాయణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఈడీఏఆర్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


