జైపూర్: వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు గురువారం హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దసరా పండుగ నేపథ్యంలో ముందుగా వేతనాలు చెల్లించాల్సింది పోయి తీవ్రమైన జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎం సుధాకర్‌రెడ్డి, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్, ఎస్వోటు ఈడీ చిరంజీవి, పీఎంపీఎల్ హెడ్ అఖిల్‌కపూర్ కార్మికులతో మాట్లాడి రాత్రి వరకు వేతనాలు చెల్లిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఎస్టీపీపీ యూనియన్ ప్రధాన కార్యదర్శి విక్రమ్, ఉపాధ్యక్షులు సాయికృష్ణ, సంపత్, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి
పోటీలకు ఎంపిక
లక్సెట్టిపేట: మండలంలోని కొత్తకొమ్ముగూడెం గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండవేణి మల్లేశ్ జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని స్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ విభాగాల్లో 370 కిలోల బరువును ఎత్తి జాతీయస్థాయి ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు.


