పటాకులతో పదిలం | - | Sakshi
Sakshi News home page

పటాకులతో పదిలం

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

● దీపావళి వేళ జాగ్రత్తలు తప్పనిసరి ● అప్రమత్తతతోనే ప్రమాదాలకు చెక్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌/నిర్మల్‌ టౌన్‌: దీపావళి పండుగ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది టపాసులు. ముఖ్యంగా పెద్దలకంటే పిల్లల సందడే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టపాసులు కాల్చే సమయంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చిన్నపాటి కారణాలతో ప్రతీ సంవత్సరం అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ కంటి చూపు కోల్పోయినవారూ ఉన్నారని పేర్కొంటున్నారు. చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో వైద్యులు సూచించిన మరిన్ని సూచనలు, జాగ్రత్తలతో కథనం..

ఇవీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు పక్కనే ఉండడం ఎంతో శ్రేయస్కరం. టపాసులను ఇంట్లో, మేడపై కాల్చేందుకు ప్రయత్నించడం ప్రమాదకరం. బహిరంగ ప్రదేశాలు, ఆరుబయట మాత్రమే కాల్చడం ఎంతో మేలు. బాణాసంచా కాల్చే సమయంలో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచుకోవడం మంచింది. నిప్పు రవ్వలు దుస్తులపై పడి వ్యాపించకుండా ఉండేందుకు కాటన్‌ దుస్తులు ధరించాలి. ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు బకెట్‌లో నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా గ్యాస్‌ సిలిండర్లు, మండే పదార్థాలకు బాణాసంచాను దూరంగా ఉంచడం చాలా అవసరం. టపాసులను ఒకసారి అంటించిన తర్వాత నిప్పు అంటుకోలేదని వెంటనే దగ్గరకు వెళ్లకూడదు. కొన్ని సందర్భాల్లో అవి పేలే ప్రమాదముంది. పర్యావరణ హితమైన పటాకులు మాత్రమే కాలిస్తే మంచిది. చుడీదార్‌ వేసుకునేవారు వదులుగా ఉన్నవి కాకుండా బిగుతుగా ఉండేవి ధరించాలి. టపాసులు కాల్చే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నిప్పు రవ్వలు పూరి గుడిసెలు, గడ్డివాములపైకి దూసుకెళ్లి భారీ అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశముంటుంది.

ప్రతీకాత్మక చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement