పరిశోధనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

పరిశోధనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థులు పరిశోధన్మాకత ఆలో చనలతో ముందుకు సాగాలని కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ప్రశంసాపత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల పరిశోధనకు జిజ్ఞాస ఓ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. నూ తన ఆలోచనలతో ఆవిష్కరణలు తయారు చేయాలని సూచించారు. చరిత్ర, గిరిజన, సంస్కృతి, అడవులు, వన్యప్రాణులు, గణిత శాస్త్రం, స్మార్ట్‌ హెల్త్‌కే ర్‌ సిస్టమ్‌ లాంటి భిన్న అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను తిలకించి వారిని అభినందించారు. ఆదివాసీ గూడేల్లో నెలకొన్న మూఢనమ్మకాలు, విద్యకు దూరమవుతున్న పిల్లల సమస్యలను గుర్తించి అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ఉట్నూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రథమ, తృతీయ బహుమతి, ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ డిగ్రీ కళాశాలకు, నిర్మల్‌ డిగ్రీ కళాశాలకు ద్వితీయ బహుమతి, కాగజ్‌నగర్‌ డిగ్రీ కళాశాలకు తృతీయ బహుమతులు లభించాయి. కార్యక్రమంలో ప్రభుత్వ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సంగీత, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్‌లు అతీఖ్‌బేగం, ప్రతాప్‌సింగ్‌, జిజ్ఞాస కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, సూపర్‌వైజర్లు యోగలక్ష్మి, కట్ట రమేశ్‌, నర్సింగ్‌రావు, పృథ్విరాజ్‌, జనార్దన్‌, జగ్‌రాం, సంతోష్‌కుమార్‌, చక్రవర్తి, స్రవంతి, శ్రీధరదేవి, జ్యోత్స్న, మంజుల, రమాకాంత్‌, రాజ్‌కుమార్‌, రవికిరణ్‌, అష్రఫ్‌ అలీ, శ్రావణ్‌, కరుణాకర్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement