కారుణ్య నియామకాల్లో జాప్యం | - | Sakshi
Sakshi News home page

కారుణ్య నియామకాల్లో జాప్యం

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

● నిరీక్షిస్తున్న సింగరేణి డిపెండెంట్లు ● తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో బాధితులు ● యాజమాన్యం వైఖరిపై అసంతృప్తి

శ్రీరాంపూర్‌: సింగరేణిలో కారుణ్య ఉద్యోగాల నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతీ సారి యాజమాన్యం డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా కారుణ్య నియామక పత్రాల పంపిణీ చేపడుతోంది. ‘డిప్యూటీ సీఎం వస్తేనే తమకు నియామ క పత్రాలు వస్తాయా’ అంటూ డిపెండెంట్లు వాపోతున్నారు. జాప్యం కారణంగా కార్మిక కుటుంబాల కు జరిగే నష్టంతో ప్రభుత్వానికీ చెడ్డ పేరు వస్తుంద ని సొంత పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ప్రస్తుతం కంపెనీ వ్యాప్తంగా సుమారు 210 మంది డిపెండెంట్లు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల కోసం వేచి చూస్తున్నారు. ఇందులో తండ్రులు, మామలు, భర్తలు చనిపోయిన వారి డిపెండెంట్లు, మెడికల్‌ ఇవ్వాలిడేషన్‌ అయిన కార్మికుల స్థానంలో వారి డిపెండెంట్లు, పేర్ల సమస్యలు, కుటుంబ గొడవలతో విజిలె న్స్‌ కేసుల పాలై వాటి నుంచి క్లియర్‌ అయిన వారు ఉన్నారు. ఇప్పటికే డిపెండెంట్‌ ఉద్యోగ అర్హత సాధించడానికి పత్రాల అందజేత, విచారణ, ఇంటర్వ్యూల పేరుతో సంవత్సర కాలం దాటిపోయింది. చివరికి మెడికల్‌ఫిట్‌ అయ్యి కూడా ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ ఉద్యోగాలు రాక వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సింగరేణి ఉద్యోగం వస్తుందని అప్పటివరకు తాము చేసే ప్రైవేట్‌ ఉద్యోగాలు, ఇతర ఉపాధి మార్గాలను వదలిలేయడంతో డిపెండెంట్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

గతంలో జీఎం ఆఫీసుల్లోనే లెటర్లు

గతంలో నియామక పత్రాలను గనులు, జీఎం కార్యాలయంలో జీఎంల చేతుల మీదుగా ఎప్పటికప్పుడు అందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీ అధికారులు ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా ఇప్పించడం మొదలుపెట్టారు. మొదటిసారి సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా, తర్వాత పలు చోట్ల సభలు ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా అందించారు. ఈ కారణంగా జరిగే జాప్యంతో ప్రభుత్వంపై కార్మికవర్గంలో తీవ్ర వ్యతిరేక వస్తోంది. ఏరియాల వారీగా స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా లెటర్లు ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement