వేమనపల్లి: మండలంలోని బు య్యారం అటవీ ప్రాంతంలో శుక్రవారం నాటుసారా స్థావరాలపై చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గుడుంబా త యారీకి 10 డ్రమ్ముల్లో సిద్ధంగా ఉన్న వెయ్యి లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి పారపోశా రు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గు డుంబా తయారీ, విక్రయాలు నేరమని పేర్కొన్నారు. ఎన్నిసార్లు తెలిపినా గ్రామస్తులు పద్ధతి మార్చుకోవడం లేదని, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీల్వాయి ఎస్సై నాగరాజు, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.


