● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాలక్రైం: తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలకపాత్ర పోషించారని, తన ఇళ్లు, ఆస్తులు సైతం తాకట్టు పెట్టిన మహనీయుడని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా కొనియాడారు. కమిషనరేట్ ఆవరణలో ఆదివారం కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాపూజీ కుమురంభీం జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27న జన్మించారని, స్వాతంత్రోద్యమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఽజరిగిన పోరాటంలో అలుపెరుగని కృషి చేశారన్నారు. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఎస్‌బీ ఏసీపీ నాగేంద్రగౌడ్, ఆర్‌ఐ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.


