బెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి డిమాండ్ చేశారు. ఆదివా రం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.55 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. బకాయిలు చెల్లించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న సీసీసీ కార్నల్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి, ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, నాయకులు మద్దెర్ల శీనివాస్, దూది ప్రకాష్, నల్లుల సంగీత, గాండ్ల మహేష్, పుల్లూరి రాము, తదితరులు పాల్గొన్నారు.


